టీడీపీ బీసీనేతలే లక్ష్యంగా విజయసాయి కుట్ర రాజకీయాలు: బుద్దా వెంకన్న

0 11

అమరావతి ముచ్చట్లు :

 

ఉత్తరాంధ్రలోని టీడీపీ బీసీనేతలే లక్ష్యంగా ఏ2 విజయసాయి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌చార్జ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఇళ్ల కూల్చివేతలు, భూముల ఆక్రమణలతో టీడీపీ వారిని తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్‌నును బెదిరించి, భయపెట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వారి అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులు రౌడీషీట్లను తక్షణమే ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోకేష్‌ ఏదో అన్నాడని చంపేస్తాము.. పొడిచేస్తామని బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్న ఆవేశంలో లోకేష్ మాట్లాడాడు తప్ప, జగన్మోహన్ రెడ్డిలా వ్యక్తిగత దూషణలు చేయలేదన్నారు. మంత్రులు, అధికారపార్టీ నేతల వ్యాఖ్యలకు ప్రజలే భయపడిపోతున్నారని తెలిపారు. అచ్చెన్నాయుడు వారి కుటుంబంపై పెట్టిన తప్పుడు కేసులపై అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Conspiracy politics aimed at TDP BC leaders: Buddha Venkanna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page