దేశానికి శ్యామా ప్రసాద్ ముఖ‌ర్జీ చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి:మోడీ

0 8

న్యూఢిల్లీ  ముచ్చట్లు :

 

జనసంఘ్‌ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు మంత్రులు, భారతీయ జనతా పార్టీ నేత‌లు ముఖ‌ర్జీకి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ ఈ దేశానికి ముఖ‌ర్జీ చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివ‌న్నారు. ఆయన  ఆదర్శాలు, గొప్ప ఆలోచనలు, ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత మనకు నిరంత‌రం స్ఫూర్తినిస్తూనే ఉంటాయ‌న్నారు. జాతీయ సమైక్యత కోసం ఆయన చేసిన ప్రయత్నాలను ఎప్పటికీ మరచిపోలేమ‌ని పేర్కొన్నారు. కాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి సందర్భంగా హౌజ్ ఖాస్‌లో ఒక మొక్క‌ను నాటారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తూ,  భోపాల్‌లో మొక్కలు నాటారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Shyama Prasad Mukherjee’s services to the country are unforgettable: Modi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page