పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 476

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా మహమ్మారి వ్యాది నుంచి ప్రజలను కాపాడేందుకు ఆనందయ్య మందును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. బుధవారం చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి ఆయన మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్‌ ఉద్యోగులకు, సచివాలయ ఉద్యోగులకు కరోనా మందును పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్  గా  సేవలు అందిస్తున్న కార్మికులకు , ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదము జరగకుండ ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పట్టణంలో కరోనా నియంత్రణ కోసం మున్సిపల్‌ కార్మికులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, వైద్యసిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కమిషనర్‌ కొనియడారు.ఈకార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, నటరాజ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags; Use corona medicine in Punganur- Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page