బంగ్లాదేశ్‌ బార్డర్‌లో పట్టుబడ్డ చైనా గూఢచారికి హైదరాబాద్‌తో లింకులు

0 14

హైదరాబాద్  ముచ్చట్లు :

 

బంగ్లాదేశ్‌ బార్డర్‌లో పట్టుబడ్డ చైనా గూఢచారిని విచారిస్తున్నకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  చైనా గూఢచారి జున్‌వేకి హైదరాబాద్‌తో లింకులున్నట్టుగా తేలింది. విశ్వ టెక్నాలజీ పేరుతో చైనా గూఢచారి జున్‌వే లావాదేవీలు జరిపినట్టుగా బయటపడింది. హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ అడ్రస్‌తో కంపెనీ రిజిస్టరయినట్టు ఆర్మీ విచారణలో తేలింది. ఈ కంపెనీలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు పార్ట్‌నర్స్‌గా ఉన్నట్లు గుర్తించారు. అబ్దుల్‌ రజాక్‌, అబ్దుల్‌ నబీ, ముస్తాక్‌, ప్రశాంత్‌కుమార్‌ల పాత్రపై ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా నిధులు వస్తున్నట్టు గుర్తించారు. గతంలో నాలుగు సార్లు భారత్‌కు జున్ వే వచ్చాడు. 2010లో హైదరాబాద్ వచ్చాడు. 2019లో బంగ్లాదేశ్‌ వీసాతో భారత్‌లోకి చొరబడ్డాడు. గుర్‌గావ్‌లో స్టార్‌స్ప్రింగ్‌ హోటల్‌ను నడుపుతున్నాడు. 2019 అక్టోబర్‌లో గురుగావ్‌ హోటల్‌ను లీజుకు తీసుకున్నాడు. ముంబై అడ్రస్‌తో మరో రెండు కంపెనీలు రిజిస్టర్‌ చేయించాడు. చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థలకు పనిచేస్తున్నాడని, నకిలీ డాక్యుమెంట్స్‌తో 1300 సిమ్‌కార్డులు కొన్నాడని విచారణలో ఆర్మీ అధికారులు గుర్తించారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Links to Hyderabad to a Chinese spy caught at the Bangladesh border

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page