బీజేపీ ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ కు ఘన నివాళులు

0 26

దర్శి ముచ్చట్లు :

 

ప్రకాశం జిల్లా దర్శి పట్టణం లో బుధవారం శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా దర్శి బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా బీజేపీ నాయకులు పిండి నారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్యాంప్రసాద్ మరణం జాతికి ఆశనిపాతం అయింది.ఆ వార్త విని జాతీయ యావత్తు క్షణం నిర్ఘాంతపోయింది. మరుక్షణం తల్లడిల్లిపోయింది. శోకసముద్రంలో మునిగిపోయింది.దేశమంతటా సంతాప ప్రకటన ప్రారంభమైంది.
‘ మాతృభూమి సేవలో నిజమైన యోధుడిగా శ్యాంప్రసాద్ కాశ్మీర్ విలీనం కోసం సాగిన పోరాటంలో అగ్రభాగాన నిలిచి బలిదానం చేశారు.శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమే అయితే బలిదానం అయ్యారో దానిని భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 370 వ అధికరణను తొలగించి, వారికి ఘనమైన నివాళి అర్పించింది.

 

 

- Advertisement -

భారత్ మాతా కీ జయ్ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలను వ్యతిరేకిస్తూ కాశ్మీర్ కూడా భారతదేశంలో భూభాగమే ఆర్టికల్ 370ను రద్దు చేయాలని ఆరోజుల్లోనే కాశ్మీర్కి పాదయాత్రగా వెళ్లి అక్కడే ప్రాణాలు వదలడం జరిగింది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుకట్ల నాగేశ్వరావు, జిల్లా   కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు వీరం రెడ్డి నాగిరెడ్డి, టౌన్ అధ్యక్షులు కనితి నాగభూషణాచారి, బీజేపీ నాయకులు అమర్     తదితరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Solid tributes to Shyam Prasad Mukherjee under the BJP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page