బోయకొండలో వేలం పాటల ద్వారా రూ:77.93 లక్షలు ఆదాయం

0 39

చౌడేపల్లె ముచ్చట్లు:

 

 

పుణ్యక్షేత్రమైన బోయకొండ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో బుధవారం  వివిధ హక్కులపై జరిగిన వేలం పాటల ద్వారా రూ:77.93 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిలు తె లిపారు.ఆలయం వద్ద కొబ్బరి కాయలు విక్రయించుకొనే హక్కు వేలం వలన రూ.21.22లక్షలు , పూల హారాలు,నిమ్మకాయలు విక్రయిచుకొనే హక్కు  ద్వారా  రూ:12.58 లక్షలు,తలనీలాలు పోగుచేసుకొనే హక్కు  వలన రూ:18 లక్షలు సమకూరిందన్నారు. ఆలయం వద్ద చీరలు సేకరించుకొనే హక్కు రూ:7.55 లక్షలు,రాజగోపురం వద్ద నాలుగు షాపుల ద్వారా రూ:18.58 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు.ఈ వేలం పాటలో పాలకమండళి సభ్యులు జె.వెంకటరమణారెడ్డి,ఈశ్వరమ్మ, పూర్ణిమ ఇన్‌ స్పెక్టర్‌ శశికుమార్‌ తదితరులు  పాల్గొన్నారు.

 

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags; Revenue of Rs. 77.93 lakhs through auction songs in Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page