మానవ సేవయే..మాధవ సేవ

0 23

-పేద కుటుంబాలను ఆదుకున్న పరశురామ బ్రాహ్మణ సేవా సంగం

పత్తికొండ ముచ్చట్లు :

 

- Advertisement -

మానవ సేవయే..మాధవ సేవ అంటూ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ మండలంలోని పెద్దహుల్తి గ్రామానికి చెందిన పేద బ్రాహ్మణుడు కరణం నరసింహారావు, పత్తికొండ పట్టణానికి చెందిన దేశాయి శైలజ , ఒంటిపల్లె  సుజాత , తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన సుజాతల కష్టాలను గుర్తించిన పీబీఎస్ఎస్ ఆ కుటుంబాలను అక్కున చేర్చుకొని సాయం అందించింది. కరోనా సమయంలో ఎలాంటి ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు అండగా నిలిచిన సంగం ఒక్కొక్కరికి సోనా మసూరి 25 కేజీల బియ్యం ప్యాకెట్ అందజేశారు. ఇంటికి పెద్ద దిక్కులేక చిన్న పిల్లలతో జీవనం చేస్తున్న వారి కుటుంబాలకు సంఘము ధైర్యాన్ని నూరిపోసింది. ఎలాంటి కష్టాలు వచ్చినా మరిన్ని సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని నిలబడాలంటూ భుజముపై తట్టి తోడుగా నిలిచిన సంఘానికి పేద బాధితులు ఆస్వాదించారు. గతంలో మాకు ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలను చూశారే  తప్ప మాకు ఇలా ఆదుకున్న సందర్భాలు లేవంటూ  కంటనీరు తీశారు.  పరశురామ  బ్రాహ్మణ సేవా సంఘ వ్యవస్థాపకుడు యర్లపాటి శ్రీధర్ శర్మ అందించిన ఆర్థిక సహాయంతో రాష్ట్రములోని 13 జిల్లాలలో సంగంలో సభ్యత్వం తీసుకొని పేద వారు అయింటే కంటి చూపులేనివారికి అపరేష న్ చేయించారు. బోధకాలు ఉన్న వారిని ఆదుకున్నారు. ఇంటి పెద్ద మృతి చెందితే అపకర్మలకు సాయం అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయాలు అయిన వారికి తోడుగా నిలిచి వైద్య చికిత్సలు చేయించారు. సంగంలో సభ్యత్వం కలిగిన వారికి లైఫ్ గ్రూప్ ఇన్స్ రెన్స్ చేయిండంలో సంగం ప్రథమ స్థానంలో నిలిచింది.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Human service is .. Madhava service

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page