మెగాస్టార్ కు జగన్ ప్రశంసలు

0 37

విజయవాడ ముచ్చట్లు:

 

టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును కొనియాడుతూ చిరంజీవి ట్వీ్ట్ చేశారు. దీంతో చిరంజీవి ట్వీట్‌పై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. జనసైనికులు చిరంజీవిపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. బండబూతులతో విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో చిరంజీవికి సీఎం జగన్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. చిరంజీవి ట్వీట్ కిందే సీఎం జగన్ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.చిరంజీవి గారు, మీ ప్రశంసలకు కృత‌జ్ఞుడిని. హృదయపూర్వక మీ మాటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా ధన్యవాదాలు. ఈ క్రెడిట్ మొత్తం గ్రామ, వార్డు సెక్రటేరియట్స్, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ డాక్టర్లు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లకు దక్కుతుంది.’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.ఇక, అంతకుముందు కోవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నం బాగుందని, ఒక్క రోజులో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించడం అభినందనీయమని చిరంజీవి ప్రశంసించారు. కోవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చిరంజీవి కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Pics compliment to Megastar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page