రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసలలో మొక్కలు నాటాలి

0 35

–  జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల ముచ్చట్లు :

 

- Advertisement -

జిల్లాలో ఉన్న రహదారుల వెంట రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసలలో మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.బుధవారం జగిత్యాల నుండి గొల్లపెల్లి, వెల్గటూర్  ప్రధాన రహదారుల వెంట నాటిన, నాటడానికి చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్
పరిశీలించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్లు వెంట  మూడువరుసలలో మొక్కలను నాటాలని, చెత్తచెదారాన్ని తొలగించాలని అన్నారు.  ఇప్పటి వరకు మొక్కలు నాటడంలో అలస్యం చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  గొల్లపెల్లి, వెల్గటూర్ యంపిడిఓలు, మండల ప్రత్యేక అధికారులు, ఈజీఎస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.

 

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Plants should be planted in three rows on either side of the road

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page