వాలంటీర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి….

0 30

-49 వ వార్డు సచివాలయంలో నూతన వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత…
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజద్ భాష

కడపముచ్చట్లు :

 

- Advertisement -

వాలంటీర్లు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేర వేయడంలో మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాష,నగర మేయర్ సురేష్ బాబు సంయుక్తంగా అన్నారు. బుధవారం  ఉపముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో 49 వ డివిజన్ అలంఖాన్ పల్లి పరిధిలోని  సచివాయంలో  నూతనంగా  ఎన్నికైనా 8 మంది  వాలంటీర్లకు నియామక పత్రాలను  అందజేశారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి  ఎస్ బి. అంజద్ బాష మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ముందుచూపుతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం  నవరత్నాలలో భాగంగా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకందించడంలో వాలంటీర్లదే ప్రముఖ పాత్ర అన్నారు.
వాలంటీర్లందరూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి,ప్రజల సమస్యలను సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిస్కార  మార్గం చూపాలన్నారు.  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా,కుల మత, రాజకీయ భేదాలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిట చేర్చడంలో వాలంటీర్లు ముఖ్య భూమిక పోషించాలన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సహృదయం తో కష్టించి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో 49 వ డివిజన్ ఇంచార్జ్ గిండి మధువర్ధన్ రెడ్డి,వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాసులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Volunteers should provide better services to the people ….

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page