శం కోసం ఆత్మబలిదానం చేసిన  మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామ  ప్రసాద్ ముఖర్జీ

0 23

ములుగు  ముచ్చట్లు:

 

భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక నాయకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ  వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని  శ్యామా ప్రసాద్ ముఖర్జీ  చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి  పాల్గొని  మాట్లాడుతూ అఖండ భారత దేశం కోసం పోరాడి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఏక్ దేశ్ మే దో నిశాంత్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో ప్రాధన్ నహి ఛలెంగే, నహి ఛలెంగే అనే నినాదంతో ఒక దేశంలో రెండు విధానాలు ఉండొద్దని జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిపై రాజీలేని పోరాటం చేసిన గొప్ప యోధుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని వారు అన్నారు.

 

 

 

 

- Advertisement -

33 సంవత్సరాల వయస్సులోనే తాను చదువుకున్న యూనివర్సిటీ కి వాయిస్ చాన్సలర్ అయ్యి రికార్డు సృష్టించిన మహా మేధావి ముఖర్జీ ని,కాశ్మీర్ ని భారత్ లో కలిపే ఉద్యమం లో భాగంగా 1952 ఆగస్టులో జమ్మూలో జరిగిన భారీ ప్రదర్శనలో మాట్లాడుతూ నేను నీకు భారత రాజ్యాంగాన్ని ఇవ్వనైనా ఇస్తాను, లేదా అందుకోసం నా జీవితాన్నేనా త్యాగం చేస్తానని ప్రకటించి 1953 సంవత్సరంలో కాశ్మీర్ లోని పరిస్థితులపై పోరాటం చేయడానికి వెళ్లిన ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచి 40 రోజుల తర్వాత అనుమానాస్పదస్థితిలో ప్రాణాలను కోల్పోవడం జరిగిందని , ఎన్ని సంవత్సరాలకు  భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖర్జీ  కలలు కన్నటువంటి దేశ ఐక్యత ఆశయాన్ని ఆర్టికల్ 370 రద్దు ద్వారా నెరవేర్చరని అన్నారు.

 

 

 

 

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ఉమ్మడి రాకేష్ యాదవ్,బిజెపి జిల్లా అధికార ప్రతినిధి దొంతి రెడ్డి వాసుదేవారెడ్డి,ప్రచారకార్యదర్శి రవిరెడ్డి,కిసాన్ మోర్చా అధ్యక్షులు జీనుకల కృష్ణాకర్,యువమోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్,యువమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా నాయకులు సానికొమ్ము రెడ్డి,అజ్మీరా కిషోర్ నాయక్,జీనుకల శ్రవణ్,రెడ్డి రంజిత్,ప్రవీణ్ సత్యనారాయణ,కనుకుల అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Dr. Shyama Prasad Mukherjee is an outstanding person who sacrificed his life for Sham

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page