సీతానగరం రేప్ పై ప్రభుత్వం సీరియస్

0 37

గుంటూరు ముచ్చట్లు:

 

తాడేపల్లిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన సీఎం వైఎస్ జగన్ మహిళా భద్రతకు సంబంధించి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ సవాంగ్‌తో సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులతో ఆయన చర్చించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. మహిళా భద్రత కోసం రూపొందించిన దిశ యాప్ వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. దిశ యాప్ వినియోగంపై అక్కాచెల్లెమ్మలకు అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని ఆయన సూచించారు. అందుకోసం సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని.. వారి ద్వారా అక్కాచెల్లెమ్మలకు దిశ యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. దిశ యాప్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు.ప్రమాదకర పరిస్థితుల్లో యాప్‌ని ఎలా వినియోగించాలనే విషయాన్ని కాలేజీ, విద్యాసంస్థల్లో విద్యార్థినులకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా పోలీసు శాఖ సిద్ధం కావాలని జగన్ సూచించారు. దిశ పోలీస్ స్టేషన్లు, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించేలా సన్నద్ధం చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు అవసరమైనన్ని పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Jagityas will be at the forefront of development

Tags: Government is serious about Sitanagar rape

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page