ఇంటిలోని సోమ్ముతో నవవధువు పరార్

0 43

హైదరాబాద్ ముచ్చట్లు:

 

వివాహమైన మూడు వారాలకే ఓ యువతి తన భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే అన్నీ సర్దుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే… నల్లకుంట పీఎస్‌ పరిధిలోని అడిక్‌మెట్‌ బాలాజీనగర్‌లో నివాసముండే బుగుడుల సాయికుమార్‌కు సిద్దిపేట జిల్లా తోగుట గ్రామానికి చెందిన సీహెచ్‌.అంజయ్య కుమార్తె నాగరాణి (20)తో మే 30న వివాహం జరిగింది. ఉదయం సాయికుమార్‌ రోజూ మాదిరిగానే ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో వదిన రేణుక సాయికుమార్‌కు ఫోన్ చేసి నీ భార్య కనిపించడం లేదని చెప్పింది. దీంతో అతడు కంగారుగా ఇంటికొచ్చి వెతకగా.. బీరువాలోని ఆమె బట్టలు, నగలు కనిపించలేదు. పుట్టింటికి వెళ్లిపోయిందన్న అనుమానంతో అక్కడికి ఫోన్ చేయగా తమ వద్దకు రాలేదని చెప్పారు. అయితే బీరువాలో నాగరాణి సెల్‌ఫోన్ గమనించిన సాయికుమార్‌ దాన్ని పరిశీలించగా మరో యువకుడితో చేసిన ఛాటింగ్ బయటపడింది.దీంతో తన భార్య కనిపించడం లేదంటూ సాయికుమార్ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాణి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే పెళ్లికి ముందే తన భార్యను ఓ యువకుడి తీసుకుపోయాడని, ఇప్పుడు కూడా అతడి హస్తం ఉండొచ్చని సాయికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The bride has to look her best during this time, because of posterity more than anything else

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page