ఏం తినాలో మీరు చెబుతారా..

0 17

గాంధీనగర్ ముచ్చట్లు:

 

రాజ్యాంగంలో పొందుపరచిన గోప్యత, జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛపై పౌరుల హక్కులకు విరుద్ధంగా ఉన్న గుజరాత్ రాష్ట్ర నిషేధ చట్టం నిబంధనలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ చేపట్టినగుజరాత్ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. గుజరాత్ ప్రొబేషనరీ చట్టం 1949లోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల నిర్వహణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బీరెన్ వైష్ణవ్ ధర్మాసనం బుధవారం విచారించింది.ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదనలు వినించిన అడ్వకేట్ జనరల్ కమల్ త్రివేది.. గతంలో సుప్రీంకోర్టు సమర్ధించిన ఏదైనా చట్టాన్ని న్యాయస్థానాలు పరిశీలనకు అనుమతించదని పేర్కొన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు చెల్లుబాటు అయ్యే ఒక చట్టం రేపు చెల్లదు.. కానీ ఆ అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉంది.. ఈ కోర్టు కాదు అని వాదించారు. గుజరాత్ ప్రొబేషనరీ చట్టాన్ని సుప్రీంకోర్టు 1951లో ఇచ్చిన తీర్పు సందర్భంగా సమర్ధించింది.ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ద్వారా ఒకవేళ చట్టాన్ని సవరించడం లేదా మార్పులు చేయాలనుకుంటే అపెక్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నేను భావిస్తున్నాను’’ అని ఏజీ పేర్కొన్నారు. ‘‘గోప్యత హక్కు అనే భావన చైనా దుకాణంలో ఎద్దు లాంటిది కాదు.. ఇది సామాజిక వాతావరణం ఆధారంగా సహేతుకమైన ఆంక్షలకు లోబడి ఉంటుంది.. ఇంటి నాలుగు గోడల మధ్య మాంసాహారం తినే హక్కును మద్యం తాగే హక్కుతో పోల్చలేం.. ఇది హానికరం దీనిని ఆపలేం’’

 

 

 

 

 

- Advertisement -

అని వాదించారు.లేకపోతే రేపటి రోజున ఇంకొకరు నా ఇంట్లో మత్తుపదార్థాలు, సైకోట్రోపిక్ పదార్థాలు తీసుకుంటుంటే మీరు నన్ను వేధించవద్దని చెబుతారు’ అని అన్నారు. అలాగే, ఈ కేసులో అదనపు ఏజీ ప్రకాశ్ జానీ కూడా.. ఈ చట్టంతో గుజరాత్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు, పిటిషనర్లు ఈ విషయం యోగ్యతపై నిర్ణయం తీసుకోవాలని వాదించారు.. ఎందుకంటే సవాల్ చేసిన నిబంధనలు 1951లో ఉన్న వాటికి భిన్నంగా ఉన్నాయని, అవి ఏళ్లుగా సవరించబడ్డాయన్నారు.మద్యం ఉత్పత్తి, అమ్మకాలు, సేవించడం వంటి గుజరాత్ ప్రొబేషన్ చట్టం 1949లోని సెక్షన్ 12, 13లను సవాల్ చేశారు. ఏకపక్ష, అహేతుక, అన్యాయమైన, అసమంజసమైన, వివక్షపూరిత.. ఆరు దశాబ్దాలకు పైగా నిషేధం ఉన్నప్పటికీ.. అక్రమంగా మద్యం అమ్మకాలు, సరఫరాలు వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలు కొనసాగిస్తున్నాయని వాదించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. తనకు నచ్చిన విధంగా సమాజంలో ఇతరులకు స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పౌరుడు జీవించే హక్కు ఉంది.. వాళ్లు ఏం తినాలి, ఏం తగాలి అనేది ప్రభుత్వం నిర్దేశించలేదు’ అని పిటిషనర్లు తన వాదనలు బలంగా వినిపించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును వాయిదా వేసింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Can you tell me what to eat ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page