కరోనా మందును వినియోగించుకోండి

0 25

చౌడేపల్లె ముచ్చట్లు:

 

కరోనా మహమ్మారి వ్యాధి నివారణకు ఆనందయ్య మందును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, పార్టీ అధ్యక్షుడు రామమూర్తిలు కోరారు. గురువారం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారె డ్డి పంపిన మందు డబ్బాలను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలకు పంపిణీ చేశారు. ఈ మందును గ్రామాల్లో ప్రజలకు పంపిణీ చేయాలన్నారు.ప్రతి ఒక్కరు ఉదయం, రాత్రి రెండు సార్లు మందు చింత గింజ మోతాదులో వేసుకోవాలని సూచించారు. మందు వేసుకొన్న వారు మాంసం, మద్యం సేవించరాదని కోరారు. సామాజిక దూరంతోపాటు, మాస్క్ విధిగా వాడుతూ కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం , తదితరులున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Use corona medication

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page