గుంటూరులో ఆత్మహత్య.. అన్నీ అనుమానాలే

0 25

గుంటూరు ముచ్చట్లు:

 

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో యువకుడి అనుమానాస్పద మరణం కలకలం రేపింది. వడ్డవల్లి ఏరియాకి చెందిన వెంకటేష్(25) తాపీ పనులు చేసేవాడు. ఈరోజు ఉదయం ఇంటి బయట శవమై కనిపించాడు. వరండాలో దూలానికి ఉరి వేసుకుని యువకుడు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతని కాళ్లు నేలకు తాకుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా ఓ బంగారం చోరీ కేసులో పోలీసులు, స్నేహితులు ఒత్తిడి చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.వెంకటేష్‌ స్నేహితుడు కన్నయ్య బంగారం చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కన్నయ్య పరారైనట్లు సమాచారం. అప్పటి నుంచి ఓ ఐడీ పార్టీ కానిస్టేబుల్, మరో ఇద్దరు యువకులు కన్నయ్య ఆచూకీ కోసం వెంకటేష్‌‌‌ని వేధింపులకు గురిచేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తరచూ ఇంటికి వచ్చి బంగారం ఎక్కడ దాచారో చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారని.. కన్నయ్య ఆచూకీ చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని తీవ్ర హెచ్చరికలు చేయడంతో భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.అయితే వెంకటేష్ కాళ్లు నేలకు తాకుతూ ఉండడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను దారుణంగా చంపేసి ఇక్కడికి తెచ్చి వేలాడదీశారని సంచలన ఆరోపణలు చేశారు. ఉరి వేసుకునేందుకు ఉపయోగించిన చీర కూడా తమ ఇంట్లోది కాదని కుటుంబ సభ్యులు చెప్పడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Suicide in Guntur .. all suspicions

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page