జెడి పౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు పూజోత్సవం

0 14

నెల్లూరు ముచ్చట్లు:

ఆహారం పండించే రైతుని గౌరవించడం మన కర్తవ్యమని పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు పేర్కొన్నారు. జె.డి.ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం  ఇందుకూరుపేట మండలంలోని పాములవారిపాలెం నందు రైతులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మురళీమోహన్ రాజు మాట్లాడుతూ రైతు శ్రేయస్సే దేశ సౌభాగ్యమని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలియజేసారు. ఈ సందర్భంగా 10 మంది రైతులను ఘనంగా సత్కరించారు. మురళీమోహన్ రాజు రైతులకు మిఠాయిలు తినిపించారు.ఈ కార్యక్రమంలో టి. వెంకటేశ్వర్లు,  జె.డి.ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: A grand farmer’s festival under the auspices of the Jedi Foundation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page