తుంగతుర్తి లో రైతుల అందోళన

0 14

సూర్యాపేట ముచ్చట్లు:

తుంగతుర్తి లో రైతులు వేపదండలు ధరించి అర్థ నగ్న నిరసన దీక్ష  కు దిగారు.  మండలం లోని అన్నారం, సంగెమ్  ఐ కే పి సెంటర్ నిర్వాహకుల దోపిడీ పై చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్క క్వింటాల్ కు 10 కేజిల చొప్పున తరుగుక్రింద దాన్యాన్ని తగ్గిస్తామని రైతులకు బెదిరింపులు తగ్గింపులకు ఒప్పుకోకపోతే ధాన్యం వాపస్ పంపిస్తామని బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపించారు. అన్యాయంగా డ్రైవర్ బేటా క్రింద క్వింటాల్ కు రు 10, హమాలి కూలీ క్రింద క్వింటా ల్ కు రు.39 వసూల్ చేసి రషీదులు ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్లకు ట్రక్ రషీదులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. తూకం లో మోసం చేస్తూ రైతుల కడుపు కొడుతున్న అన్నారం, సంగెమ్ ఐ కే పి సెంటర్లు. ఐ కే పి సెంటర్ల మోసాలపై పిర్యాదులు ఇచ్చి వారం రోజులైనా   కలెక్టర్, ఆర్ డి ఓ పట్టించుకోవడంలేదని అన్నారు. ఒక్క కిలో కూడా తరుగు క్రింద కట్ చెయ్యకుండా డబ్బులు ఇప్పించాలని అధికారులకు రైతుల విజ్ఞప్తులు చేస్తున్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల పై సూర్యాపేట కలెక్టర్, ఆర్ డి ఓ లు చర్యలు చేపట్టాలని, ఐ కే పి సెంటర్ల మోసాలపై విచారణ చేసి బాద్యులపై చర్యలు తీసుకోవాలని, రైతుల జీవితాలతో ఆదుకోవద్దని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమములో రైతుల పేర్లు తన్నీరు వెంకన్న,పూసపెల్లి శ్రీను, గోపగాని వెంకట రామ్ నర్సయ్య, కే. విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Concern of farmers in Tungaturti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page