నవ్యాంధ్రప్రదేశ్ ను వైసీపీ హత్యాంధ్రప్రదేశ్ గా మార్చింది

0 23

-టీడీపీ అధికారంలోకి వచ్చాక గుణపాఠం తప్పదు
– కింజరాపు అచ్చెన్నాయుడు

 

అమరావతి ముచ్చట్లు:

 

- Advertisement -

నవ్యాంధ్రను హత్యాంధ్రప్రదేశ్ గా వైసీపీ నేతలు మార్చారు. టీడీపీ కార్యకర్తలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.  బాధిత కుటుంబాలకు టీడీపీ అన్ని విధాలా అండగా వుంటుంది. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఈ దురాగతాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు.? జరిగే అరాచకం కళ్లకు కనిపించడం లేదా? జర్మనీలో నాజీల దురాగతాలను మించి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయి. రోజులెప్పుడూ మీవే వుండవని జగన్ రెడ్డి గూండాలు గుర్తుంచుకుంటే మంచిది. మీ పాపాలన్నింటికి బదులు తీర్చుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక 27 మంది టీడీపీ కార్యకర్తలను బలితీసుకున్నారు.

 

 

 

 

1400మందిపై పైగా దాడులు పాల్పడ్డారు. ఇన్ని హత్యలు, దాడుల జరుగుతున్నా డీజీపీ కంటికి కనిపించడం లేదా.? హత్యల్లో పాత్రులైన వారిలో ఒక్కరినైనా పట్టుకుని శిక్ష విధించారా? నీతి, న్యాయం, ధర్మానికి ప్రతిగా ఉన్న మూడు సింహాలను అరాచకం, అక్రమ కేసులు, బంధుప్రీతికి చిహ్నాలుగా మారుస్తున్నారు. జగన్ రెడ్డిని చూసుకుని వైసీపీ వాళ్లు రెచ్చిపోతే భవిష్యత్ లో మీరు తీవ్రంగా నష్టపోతారు. రాష్ట్రంలో తిష్టవేసిన సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక అల్లరిని రాష్ట్రంలో లేవనెత్తుతున్నారు. హత్యలతో రాష్ట్రంలో రక్తపాతం సృష్టిస్తున్నారు. పరిశ్రమలతో కలకలలాడాల్సిన నవ్యాంధ్ర.. దాడులు, హత్యలతో విలవిల్లాడుతోంది. పెట్టుబడిదారులతో పరిశ్రమల సంఖ్య నమోదుకావాల్సిన రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లలో టీడీపీ వారిపై అక్రమ కేసులతో ఎఫ్ఐఆర్ లు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇష్టానుసారంగా మా కార్యకర్తలపై దాడులకు తెగబడతామంటే చూస్తూ ఊరుకోమని అయన హెచ్చరించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: YCP changed Navyandhra Pradesh to Hatyandhra Pradesh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page