పుంగనూరులో కరోనా నియంత్రణలో కఠిన చర్యలు తీసుకుంటాం- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 43

– ఒకే రోజు 24 కేసులు

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

మున్సిపాలిటి పరిధిలో లాక్‌డౌన్‌ను మూడురోజులు సడలించడంతో 24కేసులు పెరిగిందని, నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ హెచ్చరించారు. గురువారం మున్సిపాలిటిలో కోవిడ్‌ కమిటి సభ్యులు , డిప్యూటి తహశీల్ధార్‌ మాధవరాజు, మెడికల్‌ ఆఫీసర్‌ రెడ్డికార్తీక్‌తో సమావేశమైయ్యారు. కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో టీ, టిఫిన్‌ హోటల్లో పూర్తిగా కుర్చోబెట్టి ప్రజలను గుంపులుగా పెట్టి తినిపిస్తే సీజ్‌ చేస్తామన్నారు. అలాగే చికెన్‌షాపుల వద్ద జనం చేరిన సీజ్‌ చేస్తామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు మాస్క్లు లేకుండ తిరగడం, ఆటోలలో పరిమితికి మించి తరలించడం కరోనా ప్రభలుతోందన్నారు. మూడవ వేవ్‌ తీవ్రంగా ఉందని , అలసత్వం వహిస్తే ప్రాణాలకు ముప్పుతప్పదని హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు కరోనా నియంత్రణకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్‌ సుబ్రమణ్యం, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌ పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: We will take strict measures to control the corona in Punganur- Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page