పెట్రో ధరలు తగ్గించాలి

0 6

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ,ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని దేశవ్యాప్త ఆందోళన కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి త మ్మినేని వీరభద్రం  అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఓకె వస్తువును ఒకే పన్ను  ఉండాలని జిఎస్టీ తీసుకువచ్చి వాటిని స్లాట్లు గా 6 – 18 శాతం గా చేశారు. 30 రూపాయలకు లీటర్ తయారవుతున్న పెట్రోల్ ను  సామాన్యులకు ఉపయోగించే 6 శాతం  పన్ను వేసినా  35 కి రావాలి. 70 శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పనులతో 100 దాటింది. ప్రపంచంలో పెట్రోల్ డీజిల్ కి  ఏ దేశం లో లేనంత ధర మన దేశంలో విధిస్తున్నారు. కరోన తో చనిపోయిన వారిని దహనం చేయడానికి క్యూలైన్ లలో ఉండాల్సి వచ్చిందని అన్నారు. సామాన్య ప్రజలకు కనీసం వైద్యం కూడా అందించే పరిస్థితి లేదు. ప్రపంచానికే వాక్సిన్ అందించే సత్తా భారతదేశానికి ఉంది కాని అలా చేయడం లేదు …అని కంపెనీలకు అనుమతి ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సహయంలో ప్రయివేటు హాస్పిటల్ ని స్వాధీనం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల వస్తువులను గోడౌన్ లలో దాచిపెట్టడం వల్ల కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారు. ఎన్నికల కోసమే ఆంధ్ర తెలంగాణ నీటి గొడవలు సృష్టిస్తున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలో ఎన్ని పర్మిషన్లు వచ్చిన ఎందుకు కట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటి కట్టగానే సరిపోతుంది..మిగిలిన ప్రాంతలకు నీళ్లు అవసరం లేదా..? ఉద్యమాలను మరింత ఉదృతం చేద్దామని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Petro prices should be reduced

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page