మహామనిత్వులు శ్రీ శ్రీ జగద్గురుఖాదర్ లింగా స్వామి

0 15

భక్తిశ్రద్ధలతో, గంధం, ఉరుసు వేడుకలు
కొలిచే వారికి ఆరాధ్యదైవం జగద్గురువు ఖాదర్ లింగా స్వామి
మతసమరస్యానికి ప్రీతికిగా నిలిచి దైవం
శివలింగం ధరించి ఆదర్శంగా నిలిచారు
317 వ ఉరుసు ఉత్సవాలు

కౌతాళంముచ్చట్లు:

 

- Advertisement -

మండల కేంద్రంలో కొలువైన మహిమనిత్వులు,కొలిచేవారికి ఆరాధ్యదైవం,మతసమరస్యానికి ప్రీతికిగా భక్తుల హృదయ ల్లో కొలువైన ఆరాధ్యదైవం,శివలింగం ధరించి ఆదర్శంగా నిలిచిన దైవం శ్రీ శ్రీ జగద్గురువు ఖాదర్ లింగా స్వామి గురువారం 317 వ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.జగద్గురువు ఖాదర్ లింగా స్వామి సన్నిధిలో  సమాధిని పన్నిటి నీటితో శుభ్రపరిచి కొత్త బట్టలు,( చద్దర్) వేసి పూలమాలలు తో అలంకరించారు. భక్తిశ్రద్ధలతో స్వామి పీఠాధిపతులు ప్రత్యేక ఫతేహాలు నిర్వహించి గంధం పూసి ఉరుసు మహోత్సవం ను ప్రారంభించారు.ఇక్కడ  నివసించే ప్రజలు కులమతాలకు అతీతంగా సేవించి దర్శించి సేవిస్తారు.లింగాయతుల ఆరాధ్యదైవం శివలింగం ధరించి ఆదర్శంగా నిలిచారు. భక్తులకు ఎన్నో మహిమలు చూపించి హృదయల్లో  సుస్థిర స్థానం సంపాదించుకున్నరు.దర్గా ఆవరణలో విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ భారీగా భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు దర్శించి ముడుపులు చెల్లించుకున్నారు. భక్తులు నైవేద్యాలు, టెంకాయలు సమర్పించిమొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నీటి వసతులు దర్గా పీఠాధిపతులు సయ్యద్ షా సాహెబ్ పిర్ చిస్తీ సౌకర్యాలు కల్పించారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ ఐ మన్మధ విజయ్ మరియు పోలీసు సిబ్బంది చూసుకున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: The great saints are Sri Sri Jagadgurukhadar Linga Swami

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page