మెడికల్ ఉద్యోగుల అందోళన

0 12

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య , పేషెంట్ కేర్ , సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆధ్వర్యంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మరియు వర్కర్స్ యూనియన్ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ  అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ కార్మికుల వేతనం19 వేలు చేయాలని  డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రకాల సిబ్బందికి వేతనాలు పెంచిందన్నారు. కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఆస్పత్రిలో పారిశుద్ధ్యం , పేషెంట్ కేర్ , సెక్యూరిటి కార్మికులను విస్మరించడం అన్యాయమన్నారు . గత సంవత్సరం ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు సిబ్బంది వేతనం 19 వేలు చేయాలన్నారు . వేతనాలు పెంచే వరకు పోరాటం నిర్వహిస్తామన్నారు . జిహెచ్ఎంసిలో పారి శుద్ధ్య కార్మికులకు రూ .17 వేలు , ఇఎస్ఎ ఆస్పత్రుల్లో కేంద్ర ప్రభుత్వం రూ .16770 లు , నిమ్స్ లో రూ .15 వేలు ఇస్తున్నారని తెలిపారు . ఆస్పత్రుల్లో కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్యం పనులు చేస్తున్నారని అన్నారు . అత్యంత మురికిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Concern of medical employees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page