యువత డ్రగ్స్ బారిన పడొద్దు

0 18

-సి ఐ వి.సురేష్ బాబు

 

జగ్గంపేట

- Advertisement -

యువత ఎవరు కూడా డ్రగ్స్ కు బానిసలు కావద్దని, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉంటారని జగ్గంపేట సి ఐ వి.సురేష్ బాబు అన్నారు.ఈనెల 26 వ తేదీ ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ నాయిమ్ అస్మి, పెద్దాపురం డిఎస్పి అరిటాకులు శ్రీనివాసరావు  ఆదేశాల మేరకు జగ్గంపేట ఎస్ ఐ ఎస్ లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం  నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట సీఐ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట కాకినాడ మెయిన్ రోడ్ లో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రజలకు డ్రగ్స్ వాడకం పట్ల కలిగే ప్రమాదాలను వివరించి యువతకు అవగాహన సదస్సు ద్వారా చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ఈ వారంరోజులు డ్రగ్స్ వారం గా జరుపుకోవడం జరుగుతుందన్నారు. యువత డ్రగ్స్ కు బానిసలై అనారోగ్యాలకు గురువ్వుతున్నారని, అనారోగ్యాలకు గురిచేసే డ్రగ్స్ వైపుకు వెళ్లకూడదన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట పోలీసు సిబ్బంది, సచివాలయ మహిళ పోలీసులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Young people are not infected with drugs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page