వంజరులను  ఎస్.టి.లలో చేర్చాలి

0 8

-తెలంగాణ వంజరి  సేవాసంఘ్ డిమాండ్

 

హైదరాబాద్  ముచ్చట్లు:

 

- Advertisement -

ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా ఎంతో వివక్షకుగురవుతున్న వంజరి కులస్థలను ప్రభుత్వం ఆదుకోవాలని నిజమైన గిరిజనజాతి అయిన వంజరులను  ఎస్.టి.లలో చేర్చాలని తెలంగాణ వంజరి  సేవాసంఘ్  రాష్ట్ర అధ్యక్షులు  ఎదుణాని శంకర్ నాదమకువంజరి డిమాండ్ చేశారు. నేడు జమోస్మానియా  లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1978 వరకు ఎస్.టి.లుగా కొనసాగిన వంజరి కులస్థుల నాటి పాలకులు అన్యాయంగా బి.సి (డి) లో కలిపారని తెలిపారు. నాటి నుంచి ప్రభుత్వాలు వంజరికులస్థులను ఎంతో వివక్షతకుగురి చేస్తున్నామని . ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంతవరకు వంజరి కులస్థలకు ప్రభుత్వ పథకాల్లో ప్రాదాన్యత దక్కలేదని ఆవేధన వ్యక్తం చేశారు. బిసి కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వంజరి కులస్థులకు తగిన ప్రాతినిద్యం ఇవ్వాలని  ఆయన కోరారు. అఖిల భారత వంజరి సేవాసంఘ్  జాతీయ  ఉపాద్యక్షులు సాత్వరు కృష్ణ వంజరి మాట్లాడుతూ  మహారాష్ట్ర , రాజస్థాన్ గుజరాత్ లలో గిరిజనులుగా గుర్తింపు పోందిన వంజరి కులస్ధులు తెలంగాణాలో బిసి(డి) లలో కొనసాగించడం అన్యాయమని అన్నారు. వంజరిలను  ఎస్.టి.లో చేర్చి తగిన న్యాయం చేయాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిసి కులాల కు నిర్మిస్తున్న అత్మగౌరవ భవనాల లో వంజరి కులస్థుల కు భవనానికి స్థలం నిధులు కేటాయించాలని కడుపేద స్థితిలో జీవనం సాగిస్తున్నవంజరుల ఆదుకొవడానికి  ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని,  వంజరికులస్థులను  సంచార గిరిజన  జాతిగా గుర్తించి ప్రభుత్వ  ప్రోత్సహాకాలు అందించాలని, నామినేటెడ్  పదవుల్లో వంజరులకు తగిన అవకాశాలు ఇవ్వాలని , ప్రభుతత్వాన్ని కోరుతూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానాలు చేసింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర నాయకులు కె.నర్సింగ్ రావు , సురేష్ కాలేరు, సామల బాలక్రిష్ణ , వై గొపాల్  రామకిృష్ణ  ,కె.రూపాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Wanjars should be included in STs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page