వీడియో మార్ఫింగులు చేసి దేవస్థానం పరువుతీస్తే కఠిన చర్యలు- ఈఓ సూర్యకళ

0 17

సింహాచలం ముచ్చట్లు:

 

ఇటీవల కొందరు సింహాచలం శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలను మార్ఫింగ్ చేయడంపై దేవస్థానం ఈఓ సూర్యకళ తీవ్రంగా స్పందించారు. రీమిక్సులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే సైబర్ క్రైమ్ కు కంప్లైంట్చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి చర్యల్లో దేవస్థానం సిబ్బంది పాత్ర ఉందని తేలితే కచ్చితంగా చర్య తీసుకుంటామని తేల్చిచెప్పారు.  దేవాదాయశాఖ కమిషనర్ కు కూడా రిపోర్టు చేస్తామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పీఆర్వో, కెమెరామ్యాన్ తప్ప ఆలయంలోపలకికి ఎవరి మొబైల్స్ అనుమతించబోమని… బయట లాకర్లలో పెట్టుకోవాల్సిందేననన్నారు.  సింహాచల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి ఆస్కారమేలేదని ఈఓ సూర్యకళ చెప్పారు.  టెండర్లు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లోనూ… హిందువులను, దేవునిపై విశ్వాసమున్నవారినే తీసుకుంటున్నామని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Strict measures if video morphing is done and the temple is tarnished- EO Suryakala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page