అనంతలో మూడింట ఒక వంతు వేరుసెనగ క్వింటాళ్లు

0 28

అనంతపురం   ముచ్చట్లు:
ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ కోసం ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టుకున్న సబ్సిడీ వేరుశనగ విత్తనాల్లో దాదాపు మూడింట ఒక వంతు (33 శాతం) అమ్మకం అయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. సుమారు లక్షన్నర క్వింటాళ్ల వరకు మిగిలిపోతాయని అంచనాకొచ్చారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే లక్ష క్వింటాళ్లకుపైన మిగులుతాయంటున్నారు. సీడ్‌ను ఎలాగైనా సేల్‌ చేయించేందుకు పంపిణీ గడువును దశలవారీగా పెంచుతూ వచ్చారు. చివరిగా ఈ నెలాఖరును వ్యవధిగా నిర్ణయించారు. ఖరీఫ్‌లో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో నాలుగున్నర లక్షల క్వింటాళ్ల రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీకి ప్రణాళిక వేసుకొని ఆ మేరకు సీడ్‌ను రైతుల నుండి నేరుగా సేకరించారు. మే 17 నుండి రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ ప్రారంభించారు. రైతుల పేర్ల నమోదు మే పది నుండే మొదలుపెట్టారు. మామూలుగా వేరుశనగ విత్తనాల పంపిణీ జూన్‌ 15 కల్లా పూర్తవుతుంది. తొలకరి వానలకే రైతులు విత్తనాలు వేస్తారు.ఈ ఏడాది ఆదిలోనే వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్‌), నిరుటి అధిక వర్షాల అనుభవం, సబ్సిడీ విత్తనం ధర అధికంగా నిర్ణయించడం, నాణ్యతలేమి, తమ విత్తనాలను తమకే అధిక ధరలకు అమ్మడం, ఒక రైతుకు గరిష్టంగా మూడు మూటల కాయలేననడం, కరోనా రెండోదశ ఉధృతి పర్యవసానాలు, ఇత్యాది కారణాల వలన రాయితీ విత్తనాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు.

సేకరించిన విత్తనాల్లో పెద్ద ఎత్తున సేల్‌ కాకుండా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రభుత్వం విత్తనాల పంపిణీ గడువును దఫ దఫాలుగా పెంచుతూ వచ్చింది. తొలుత జూన్‌ 10 ఆఖరు తేదీ అనగా, అనంతరం 15వ తేదీ, 20వ తేదీ అంది. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు వ్యవధి ఇచ్చింది. సేకరించిన విత్తనాలు మిగిలిపోతే ప్రభుత్వానికి, ప్రధానంగా ఎపి సీడ్స్‌కు నష్టం వస్తుందని, సేకరణ సమయంలో ఊహించిన విధంగా కమీషన్లు రావన్న ఆందోళనలతో కొంత మంది సతమతమవుతున్నారని సమాచారం.అనంతపురంలో మూడు లక్షల క్వింటాళ్లు సేకరించాలనుకోగా 2.90 లక్షల క్వింటాళ్లు సేకరించారు. వ్యవసాయశాఖ సహాయంతో ఎపి సీడ్స్‌ 2.4 లక్షల క్వింటాళ్లు సేకరించగా, నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌సి) 50 వేల క్వింటాళ్లు సరఫరా చేసింది. ఇప్పటి వరకు 1.8 లక్షల క్వింటాళ్లు పోవడం కనాకష్టమైంది. చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు ఇంచుమించుగా తలా 50 వేల క్వింటాళ్ల చొప్పున సేకరించగా అక్కడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. మొత్తమ్మీద సేకరించిన నాలుగున్నర లక్షల క్వింటాళ్లలో లక్షన్నర క్వింటాళ్ల వరకు మిగులుతాయంటున్నారు. ఇదిలా ఉండగా ఎలాగైనా మరో 50 వేల క్వింటాళ్లు అమ్మాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎపి సీడ్స్‌ సేకరించిన మేరకు విక్రయించి ఎన్‌ఎస్‌సి సరఫరా చేసిన సుమారు 55 వేల క్వింటాళ్లు సేల్‌ కాకపోయినా ఫర్వాలేదనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:One-third of infinity is peanut quintals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page