ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా పనులు నిర్వహిచాలి

0 15

– జిల్లా కలెక్టర్ జి. రవి

 

జగిత్యాల ముచ్చట్లు:

 

- Advertisement -

సమీకృత జిల్లా కార్యాలయల సముదాయాన్ని (కొత్త కలెక్టర్ కార్యాలయ భవనం) భవిష్యత్ అవసరాలకు సరిపోయో విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,  భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా నిర్మాణ పనులను చేపట్టాలని కలెక్టర్ సూచించారు.  శుక్రవారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయల సముదాయాన్ని  పరిశీలించారు.  భవనం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రెండు హెలిప్యాడ్ వచ్చేలా ప్రణాళిక ప్రకారం నిర్మాణాలను చేపట్టాలని,  రోడ్డుకు  ఇరువైపుల ఉన్న అనవసర విధ్యూత్ లైన్ ను తొలగించి, రోడ్డు మద్యలో ఏర్పాటు చేసిన డివైడర్ లో వచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు.  భవనం ముందు మరియ లోపలి బాగంలో వీలైనన్ని ఏక్కువ మొక్కలు నాటి పచ్చదనంతో నిండెవిధంగా చూడాలని అన్నారు.  అనంతరం కార్యాలయంలో  గదులను పరిశీలించి  మరింత ఆధునికంగా ఉండేలా సూచనలు సలహాలను ఇచ్చారు.  ముఖ్య అతిధులతో పాటు, సామాన్యుల వరకు కార్యాలయానికి వచ్చే వారి వాహనాల పార్కింగ్ లో ఇబ్బందులు తలెత్తకుడా అవసరమైన చర్యలు చెపట్టాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఈఈ ఆర్ ఆండ్ బి  శ్రీనివాస్ రావు, అటవీశాఖ అధికారి, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్, విధ్యూత్ శాఖ అధికారులు,  తహసీల్దార్ వెంకటేష్ , ఇతర అధికారుల పాల్గోన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Tasks should be carried out in a planned manner so that difficulties do not arise

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page