ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ నేతలకు సన్మానం

0 13

వర్ధన్నపేట ముచ్చట్లు:

నాటి దేశ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 1975 లో కాంగ్రెస్ పార్టీ స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీని విధించడం జరిగిందని నాడు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాడిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులను బీజేపీ  మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో నాడు విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ బ్లాక్ డే గా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రాయపురపు కుమారస్వామి మాట్లాడుతూ ఆ రోజుల్లో ఎమర్జెన్సీ సమయంలో అక్రమ అరెస్టులకు గురైన మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన  పోశాల సూర్య నారాయణ,మంచె సాయిలును మండల పార్టీ తరపున శాలువా కప్పి సన్మానించడం జరిగిందని తెలిపారు.1975లో ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆ నాటి విద్యార్థులను,ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ నాయకులను అరెస్టులు చేసి జైలుకు తరలించడం జరిగిందని అన్నారు.1975-77 వరకు విధించిన ఎమర్జెన్సీ సమయంలో జరిగిన విషయాల పై భవిష్యత్ తరాలకు తెలియాజేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్,జిల్లా ఉపాధ్యక్షులు నాంపల్లి యాకయ్య,ప్రచార కార్యదర్శి పిట్టల రాజు,జిల్లా ఓబిసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పెద్దూరి రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు న్యాలం సాయిలు,అంగడి రజిత, మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణమూర్తి,సీనియర్ నాయకులు చీపురు వెంకటస్వామి,యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మెరుగు రామరాజు  తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Tribute to BJP leaders who fought against the Emergency

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page