కనిపించని వాన జాడ

0 22

అదిలాబాద్  ముచ్చట్లు:

 

మొదట్లో ఊరించిన వర్షాలు ఇప్పుడు వెనక్కి తగ్గినయ్. గడిచిన మూడు, నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వాన జాడలేదు.  దీనికి తోడు ఎండలు మండుతుండడంతో ఇప్పటికే వేసిన పత్తి మొలకలు చేలలోనే ఎండుముఖం పడుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల వరకు వర్ష సూచన లేదని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది స్టేట్వైడ్ 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ అధికారులు మొదట అంచనా వేశారు. కానీ కాటన్ సీడ్ అమ్మకాలు, ఇటీవలి వర్షాలకు సిద్ధం చేసిన దుక్కుల విస్తీర్ణాన్ని బట్టి మరో 10 లక్షల ఎకరాల్లో అదనంగా పత్తి సాగవుతుందని భావిస్తున్నారు. నిజానికి  రాష్ట్రంలో 70శాతానికి పైగా పత్తిని రైతులు వర్షాధార పంటగానే పండిస్తారు. ఈ వానకాలం పత్తి తర్వాత కంది 20 లక్షల ఎకరాల్లో, సోయా 1.33 లక్షల ఎకరాల్లో మెట్ట పంటలుగా సాగుచేస్తున్నారు. ఈసారి జూన్ మొదటివారంలోనే  రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, అడపాదడపా వర్షాలు పడడంతో రైతులు ముందస్తుగానే సాగుకు ఉపక్రమించారు. పత్తి ఎక్కువగా సాగుచేసే ఉమ్మడి ఆదిలాబాద్లో 5.5 లక్షల ఎకరాలలో ఇప్పటికే పత్తి విత్తనాలు వేశారు. తీరా గడిచిన నాలుగైదు రోజులుగా వర్షం పడకపోవడంతో మొలకలు ఎండిపోతున్నాయి. రానున్న 72 గంటలవరకు తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచనలేదని తెలంగాణస్టేట్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వెదర్ రిపోర్ట్ ప్రకారం.. భద్రాద్రి, ములుగు జిల్లాల్లోని కొన్ని ఏరియాల్లో మాత్రమే కొద్దిమేర వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి వర్షంపై ఆధారపడి సాగుచేసిన పంటలకు ఇబ్బంది తలెత్తే అవకాశముంది. ఇదే జరిగితే మొలకదశలో ఉన్న పత్తి, సోయాకు నష్టం వాటిల్లుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటున్నారు. రైతులు మొదటి దఫా వర్షాలకే తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని, రెండో దఫా పుంజుకున్నాకే విత్తుకుంటే మంచిదని ఆఫీసర్లు చెబుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Invisible rain trail

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page