కరోనాపై అవగాహన కలిగి, భయాందోళనలు విడనాడాలి  ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ కోట సునీల్ కుమార్

0 12

నెల్లూరు ముచ్చట్లు:

శుక్రవారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో  విలేకరుల సమావేశం, ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా సునీల్ కుమార్ పాల్గొన్నారు  .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు, ధన, కనక ,వస్తు, వాహన, బుద్ధి బలము కలవారు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ మానసిక ధైర్యం కలిగి ఉండాలన్నారు.  కరోనా వ్యాధి నివారణకు , వ్యాధిని రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాల అవసరం ఎంతో ఉందన్నారు. ఈ క్రమంలో తమ వంతు బాధ్యతగా జర్నలిస్టు మిత్రులకు  అవి అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు .ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవాలని ఆయన సూచించారు  .తాము ఎలాంటి ధనమును ఆశించడం లేదని వస్తువులు ఎవరైనా ఇస్తే, తగిన మందు తయారు చేసి ఇవ్వగలం అన్నారు  .కరోనా ఉద్ధృతం పెరిగే అవకాశాలున్నాయని, దాని నిరోధించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు  . ప్రస్తుత తరుణంలో ఎవ్వరు తయారుచేసినా, మందుపేరు ఆనందయ్య మ౦దుగానే మిగిలిపోతుందన్నారు  .ఈ సందర్బంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ జిల్లా అధ్యక్షుడు వి. వెంకటేశ్వర్లు కోట సునీల్కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Be aware of the corona and let go of panic attacks
Leading sociologist Dr. Kota Sunil Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page