జమ్మూ కశ్మీర్‌కు మొదట సంపూర్ణ రాష్ట్ర హోదాను ప్రకటించాలి      కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం డిమాండ్

0 11

న్యూఢిల్లీ    ముచ్చట్లు:
జమ్మూ కశ్మీర్‌కు మొదట సంపూర్ణ రాష్ట్ర హోదాను ప్రకటించాల్సిందేనని, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం డిమాండ్ చేశారు. అలా కాకుండా మొదట ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటించడం వింతగా ఉందని విమర్శించారు. ‘‘మొదట రాష్ట్ర హోదా ఇచ్చి, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్‌తో సహా కశ్మీరీ నేతలందరిదీ ఇదే మాట. ‘‘ఓ బండిని గుర్రం లాగడం సహజమైన ప్రక్రియ. అందుకే గుర్రాన్ని ముందు పెట్టి, బండిని లాగాలి. జమ్మూ కశ్మీర్ విషయంలోనూ అంతే. మొదట రాష్ట్రహోదా. ఆ తర్వాతే ఎన్నికలు. అలా నిర్వహిస్తేనే ఎన్నికలు సరైన క్రమంలో జరుగుతాయి. కానీ ఇందుకు విరుద్ధంగా కేంద్రం ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు’’ అంటూ చిదంబరం ట్వీట్ చేశారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Jammu and Kashmir must first be declared a full state
Congress senior leader Chidambaram demanded

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page