ప్రత్యామ్నాయంగా కమలం

0 22

వరంగల్  ముచ్చట్లు:

తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటే కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చేంత బలముందా? లేదా? అన్నది పక్కన పెడితే బీజేపీని ఒక విషయంలో మాత్రం ప్రజలు విశ్వసిస్తున్నారు. బీజేపీకి ఓటేస్తే ఆ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేయరని. అదే రానున్న ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజీగా మారనుంది. కాంగ్రెస్, టీడీపీ తో పాటు మిగిలిని చిన్నా చితకా పార్టీలను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రెండు సార్లు గెలిచిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. టీడీపీని ఏకంగా విలీనం చేసుకుంది. కాంగ్రెస్ నుంచి తొలి, రెండో దఫాలోనూ పేరున్న, నమ్మకమున్న నేతలే పార్టీని ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లు వేసినా అది టీఆర్ఎస్ ఖాతాలో పడినట్లేనన్న భావన ప్రజల్లో బాగా పెరిగింది. ఇది బీజేపీకి అడ్వాంటేజీగా మారింది.సహజంగా బీజేపీ నుంచి గెలిచిన వారు పార్టీ మారే అవకాశాలు తక్కువ. గెలిచిన వారు తక్కువ మంది అయినా అధికారపార్టీ వైపు వెళ్లేందుకు వారు సుముఖత చూపరు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ కొంత బీజేపీ లోఎక్కువగా కన్పిస్తాయి. అందుకే రెండుసార్లు బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెలంగాణలో పార్టీ మారని విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. అందుకే ప్రజలు బీజేపీ వైపు ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు.ఇక నేతలు కూడా బీజేపీ వైపు రావడానికి అదే కారణం. కాంగ్రెస్ పూర్తిగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత రాష్ట్రంలో హవా నడుస్తుంది. అందుకే ఎక్కువ మంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు చూస్తున్నారు. రానున్న కాలంలో బీజేపీలోకి అనేక మంది వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్న విషయాన్ని కొందరు కొట్టిపారేస్తున్నా దానిని కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీపైనే ప్రజల్లో కొంత నమ్మకం ఉంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Alternatively lotus

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page