రైతు వేదికను ప్రారంభిన మంత్రి నిరంజన్ రెడ్డి

0 10

రేవల్లి ముచ్చట్లు:

 

ఏపీ జలదోపిడీ, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై రేవల్లి మండలకేంద్రంలో రైతువేదికను  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ నేతలది సైంధవపాత్ర. – హక్కు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తాం .. దాదాగిరీ, గూండాగిరి నడవనివ్వం. – ఇప్పుడు మాదొక రాష్ట్రం .. మా హక్కులకు విరుద్దంగా కృష్ణా బేసిన్ లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వం. – కృష్ణా నది నుండి తెలంగాణకు హక్కుగా వచ్చే ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటాం.  వెన్నెముక లేని బానిస నేతల మూలంగానే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగింది.

 

 

 

- Advertisement -

ఏపీ జలదోపిడీని ఎట్టి పరిస్థితులలో అడ్డుకుని తీరుతాం .. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాం.  – సమైక్యపాలనలో ఆంధ్రా జలదోపిడీకి మద్దతుగా హారతులు పట్టినోళ్లు, దొంగ ప్రాజెక్టులకు సద్దులు మోసిన ఇంటి దొంగలు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని హాహాకారాలు చేస్తున్నరు.  తెలంగాణ ఉద్యమమే నదీజలాలు, సాగునీటి హక్కుల కోసమని అన్నారు.  కృష్ణాజలాలలో తెలంగాణ నీటి వాటా తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది.  ఉమ్మడి రాష్ట్రంలో పాలకులుగా మీరున్నారు .. పాలితులుగా తెలంగాణ ప్రజలున్నారు .. అప్పుడు ఇక్కడి నాయకత్వం మీకు పదవుల కోసం బానిసలుగా మారడంతో అక్రమ ప్రాజెక్టులను కట్టగలిగారని అన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Minister Niranjan Reddy inaugurated the farmer forum

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page