వ్యవసాయ బయోలాజికల్ కంట్రోల్  ల్యాబ్ కు శంకుస్థాపన

0 19

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వ్య వసాయ బయోలాజికల్ కంట్రోల్  ల్యాబ్ కు శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేసారు.  వ్యవసాయ బయోలాజికల్ కంట్రోల్  ల్యాబ్ తో పాటు ఆమదాలవలస మున్సిపాలిటీకి సరఫరా చేసే  త్రాగునీటి పైపు లైన్ కు  కుడా అయన శంకుస్థాపన చేసారు. ఆమదాలవలస మార్కెట్ యార్డ్ లో 1.37 కోట్ల వ్యయంతో వ్యవసాయ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించనుంది. మున్సిపాలిటీ కి త్రాగు నీరు అందించే ప్రధాన పైపులైన్ ను దండ్రాసి మెట్ట నుండి  రైల్వే గేట్ వరకు సుమారు రూ. 65 లక్షల వ్యయంతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసన సభాపతి సీతారాం మాట్లాడుతూ ఆమదాలవలసలో ఏర్పాటు చేస్తున్న లాబ్ వలన ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ల్యాబ్ ద్వారా తయారైన జీవ రసాయన ఎరువులు వినియోగించడం వలన భూసారాన్ని కాపాడటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జీవ రసాయన ద్వారా పంట దిగుబడి పెరుగుతుందని, భూమాతను పరిరక్షించుకుని పది కాలాల పాటు పంటలను వేసుకోవచ్చని ఆయన వివరించారు. పూర్తిగా పర్యావరణ హిత ఎరువులను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.  ల్యాబ్ ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ల్యాబ్ ద్వారా తయారైన జీవరసాయనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Concreting for Agricultural Biological Control Lab

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page