సచివాలయ భవన నిర్మాణానికి స్థల పరిశీలన-వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 41

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలోని కొండయ్యగారిపల్లె సచివాలయం భవన నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి శుక్రవారం స్థల పరిశీలన చేశారు.విజయవాణి పాఠశాల ల సమీపంలోని ఠాణా కొత్త యిండ్లు వద్ద బాబురాజు, స్రుబ్బారెడ్డిలకు చెందిన స్థలాన్ని గుర్తించారు. అక్కడే సచివాలయం, ఆర్‌బిజె. విలేజ్‌ హెల్త్ క్లినిక్‌ కేంద్రాల భవనాలను నిర్మించడానికి సరిపడా స్థలం ఉందని ఇక్కడే నిర్మాణాలు చేపట్టడానికి చర్యలు తీసుకొంటున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, వైస్సార్‌సీపీ నేతలు పద్మనాభరెడ్డి, బాబురెడ్డి, నారాయణ, తిమ్మయ్య, తదితరులున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Site inspection for construction of Secretariat building-YSSRCP State Secretary Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page