అంకెల మార్పులతో వక్ఫ్ బోర్డు భూములు రిజిస్ట్రేషన్లు

0 4

నంద్యాల  ముచ్చట్లు :
నంద్యాల జిల్లా కాబోతున్నదని ఊహాగానాలు వినిపించడముతో. నంద్యాల పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రైవేటు భూములు ఓక ఏకర 5 కోట్లు పలుకు తుంటడముతో  ఇంటి స్థలాలకు  విపరీతంగా డిమాండ్ పెరిగింది . భూ కబ్జా దారులు  వక్ఫ్ భూములపై కన్ను పడింది . వక్ఫ్ బోర్డు అధికారులు మరియు రెవెన్యూ అధికారుల  సహకారంతో సర్వే నెంబర్లను మార్చి(తప్పు గా చూపించి) రిజిస్ట్రేషన్లు మద్య వర్తుల ద్వారా భారిగా జరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి . నూనెపల్లె లో గల వక్ఫ్ భూములపై  వీరి ద్రుష్టి పడింది . సర్వే నెంబరు 22.47.52. 228.231.233/A. 236.239. 275.278.284. సర్వే నెంబర్ ల లో 74 ఎకరాల వక్ఫ్ భూములను కొంత మంది నాయకుల సహకారంతో కొనుగోలు జరిగాయని తెలుస్తోంది . బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారని. ఎవరి వాటాలు వారు తీసుకున్నారని  విమర్శలు వినిపిస్తున్నాయి . ముస్లిం సోదరులు  మాట్లాడుతూ ఇంత అన్యాయం ఎక్కడ జరిగలేదని వాపోయారు. ఆ భూములు   ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం వారి కే చెందుతాయని ప్రభుత్వం పదె పదే ప్రకటనల చేస్తూనే వుందన్నారు .  గతంలో  కొంత మంది ముస్లిం మైనార్టీ వారు వక్ఫ్ భూములను ఇతరులు కొనుగోలు చేస్తున్నారని. మరియు భూ కబ్జాదారులు ఆక్రమించుకొను చున్నారని ఏన్నో ధర్నాలు నిరహర దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. అయినా ఏన్నో అక్రమాలు జరిగాయని తెలిపారు. గతంలో ఈ విషయం పై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు . కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలం లో జెండాలు పాతి ఈ భూములు వక్ఫ్ బోర్డు కు సంబంధించినవి అని ఎటువంటి లావాదేవీలు నడప కూడదని ఎటువంటి నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసారు.  కొందరు వక్ఫ్ బోర్డు అధికారులు ప్రమేయం తో . రాజకీయ నాయకుల ప్రమేయం తో . అవినీతి రెవెన్యూ అధికారుల సహకారంతో భాగంగానే వక్ఫ్ భూములపై వెంచర్లు వేయడం మరియు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . ఈ అవినీతిని కప్పిపుచ్చు కోవటానికి రాజకీయ నాయకులకు అధికారులకు భారిగా సొమ్ము ముట్టినదని వినిపిస్తున్నాయి .  ముస్లిం మైనార్టీ పెద్దల హస్తంతోనే ఈ వ్యవహారం నడుస్తోంది అని కొంతమంది ముస్లిం మైనార్టీ సోదరుల  ఆరోపణలు చేస్తున్నారు . ఏది ఏమైనా వక్ఫ్ భూములను కాపాడాలని పలువురు ముస్లిం మైనార్టీ సోదరులు  కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భూ కబ్జా దారులను  అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు  ఈ భూముల్లో పేద ముస్లిం సోదరులకు స్థలాలు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. .

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags:Wakf board lands registrations with digit changes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page