అదుపుతప్పి ఇళ్లల్లోకి దూసుకెళ్లిన లారీ  ముగ్గురికి తీవ్ర గాయాలు

0 16

అనంతపురం   ముచ్చట్లు:
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని పైతోట వద్ద గల 544ఎ అనంతపురం- మొలకాల్మురు జాతీయ రహదారి లో  లారీ అదుపు తప్పి ఇళ్లల్లోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ తో కలిపి 3 వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటకలోని మొలకాల్మురు పట్టణం నుంచి రాయదుర్గం వైపు ఎర్ర ఇటుకలు రవాణా చేస్తున్న లారీ రాత్రి వేళ లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తప్పించబోయి జాతీయ రహదారి పక్కన ఉన్న జనావాసాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో  డ్రైవర్ తో పాటు ద్విచక్ర వాహనం లో వస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులనువెంటనే రాయదుర్గం కమ్యూనిటీ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు . వారికి బలమైన రక్త గాయాలు కావడంతో ఉత్తమ చికిత్సకై కర్నూల్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ఈ  రోడ్డు ప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన ఈ సమయంలో ఇంటిలో పిల్లలతో కలిసి 9 మంది నిద్రపోతున్నారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులు ఇంటి ముందు నిద్రపోయేవారు . కానీ  ఈ రోజు వారంతా ఇంటిలో నిద్రించడం వల్ల ప్రాణాలతో బయట పడినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడే తమను రక్షించాడని తెలిపారు. లారీ  ప్రమాదం జరిగిన వెంటనే భారీ శబ్దం రావడంతో పై తోట ప్రాంతంలోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. లారీ  ఇంటి లోకి దూసుకెళ్లడంతో ఘటనా స్థలానికి వెళ్లి లారీ లో ఇరుక్కున్న డ్రైవర్నీ అతి కష్టంపై బయటకు తీశారు. లారీ డ్రైవర్ అతివేగం తో పాటు  ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ ఈరన్న ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags:Three people were seriously injured when Larry crashed into a house

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page