అభివృద్ది పనులను వేగవంతం చేయాలి

0 22

– కాంట్రాక్టర్లు,అధికారులతో సమీక్ష
– నెలరోజుల్లో పనులు ప్రూర్తిచేసేలా చూడాలి
– త్వరగా బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తాం

 

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నిర్మిస్తున్న సచివాలయ, ఆర్‌బికె. విఎల్‌ఎస్‌ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి లు సూచించారు. శనివారం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలమేరకు వెంగళపల్లె గ్రామ సచివాలయంలో అభివృద్ది పనులపై కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష జరిగింది. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయం పరిధిలో 54 సిమెంటు రోడ్డు పనులకు గాను రూ:89.06 లక్షలు మంజూరుచేయగా పనులన్నీ పూర్తిచేశారని అభినందించారు. రూ:95.04 లక్షల వ్యయంతో మంజూరైన సచివాలయం, ఆర్‌బికె. విఎల్‌ఎస్‌, బిఎంసీయూ భవనాల నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయని, వాటిని త్వరగా నెలరోజుల్లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతను పాటించాలన్నారు.పనులు పూర్తిచేసిన వెంటనే బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని పిఆర్‌ ఏఈ పురుషోత్తం కు సూచించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పనులు చేయాలని కోరారు.అనంతరం పనులను పరిశీలించి సూచన లిచ్చారు.. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సుకుమార్‌, ఎంపీటీసీ లక్ష్మినర్సయ్య, వైఎస్సార్‌సీపీ నేతలు ఓబులేసు, శేఖర్‌, శ్రీనివాసులు, తదితరులున్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Development work should be accelerated

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page