ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధుల బూతు పంచాగం

0 25

రంగారెడ్డి ముచ్చట్లు:

 

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో  వారిద్దరు మహిళ ప్రజాప్రతినిధులే. ఒకరు సర్పంచ్. ,మరొకరు ఎంపీటీసీ. ఇద్దరూ ప్రజలకు సర్దిచెప్పేవారే. కానీ వారే పల్లెనిద్ర కార్యక్రమంలో మండల అధికారుల సమక్షంలో ప్రజల ముందు బహిరంగంగా ఒకరికొకరు దూషించుకోవడం చర్చనీయాంశంగా మారింది.వివరాలకు వెళ్తే శుక్రవారం  రాత్రి పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మాల్ గ్రామాన్ని  ఎంచుకొని యాచారం ఎంపీపీ సుకన్య , అధికారులు ఎంపీడీఓ, ఈఓఆర్డీ, ఇతర అధికారులు అక్కడికి వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ  సమయంలో ఇందిరమ్మ కాలనీ దాటి  ప్రాథమిక మండల పరిషత్ పాఠశాలలో నీటి సమస్య విషయమై సర్పంచ్ కవిత, ఎంపీటీసీ ఇస్రత్ భేగం  దూషించుకున్నారు. ఇంతలో సర్పంచ్ భర్త వచ్చి ఎంపీటీసీ ఇస్రత్ బేగంను బూతులు తిట్టడం ప్రారంభించాడు.  తరువాత సర్పంచ్ కవిత సృహ కోల్పోవడంతో ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఎంపీటీసీ ఇస్రత్ బేగం మాల్ లో జరిగిన సంఘటన విషయమై యాచారం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Whore panchayat of two women MPs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page