కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదు టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

0 17

హైదరాబాద్  ముచ్చట్లు :
దళిత మహిళ లాకప్ డెత్ సభ్యసమాజం తలదించు కోవాల్సిన ఘటన. కాంగ్రెస్ నాయకులు చెబితే వారం తర్వాత సీఎం స్పందించారని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎల్పీ బృందం కలిసినప్పుడు లాకప్ డెత్ గురించి తనకు తెలియదని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదని అయన అన్నారు.
దళిత సీఎం హామీ ఏమైంది. 12శాతం జనాభా ఉన్న మాదిగలకు మంత్రిపదవి కూడా లేదు. మాదిగల్లో ఒక్కరికి కూడా మంత్రి అయ్యే అర్హత లేదా. దళితుల మీద వేధింపులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది దళితులే. దళితుల సాధికారత గురించి ఇప్పుడా మాట్లాడేది. టిఆర్ఎస్, బీజేపీ దళితుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. దళితులను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది. దళితులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని అయన అన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

- Advertisement -

Tags:KCR is not eligible to be CEO
TPCC Chief Uttam Kumar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page