కొవిడ్‌ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు గొప్ప ఆలోచన: గవర్నర్‌ తమిళిసై

0 14

హైదరాబాద్‌  ముచ్చట్లు :
రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగుతున్నదని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ చెప్పారు. నగరంలోని వెంగళ్‌రావునగర్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కమాండ్‌ సెంటర్‌ను గవర్నర్‌ తమిళిసై సందర్శించారు. కొవిడ్‌ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రభుత్వ గొప్ప ఆలోచన అని ప్రశంసించారు. ఇందులో ఉన్న వార్‌ రూమ్‌, కాల్‌ సెంటర్‌ ద్వారా అవసరమైనవారికి వైద్య సేవల సాయం అందిస్తున్నారని చెప్పారు. కరోనా మూడో దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధతలో భాగంగా.. వెంగళ్‌రావునగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్‌లో కొవిడ్‌ కమాండ్‌ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు. ఇందులో కమాండ్‌ సెంటర్‌, కాల్‌ సెంటర్‌, టెలిమెడిసిన్‌ ఉన్నాయి.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

- Advertisement -

Tags:Great idea to set up Kovid Command Center: Governor Tamilisai

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page