చంద్రగిరిలో.. ” దిశా ” యాప్ పై అవగాహన సదస్సు

0 13

* మహిళల రక్షణే జగనన్న లక్ష్యం
* ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
* పెద్ద ఎత్తున హాజరైన సంఘ మిత్రలు

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

మహిళల ఆత్మరక్షణకు కవచంగా దిశా యాప్ పనిచేస్తుందని.. యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ మహిళా పోలీసులు, సంఘ మిత్రలు, మహిళా సంఘ లీడర్లకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మేరకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో దిశ యాప్ వినియోగానికి చెవిరెడ్డి సంకల్పించారు. శనివారం శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా దిశా చట్టం, యాప్ పై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు శ్రీ పద్మావతీ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు విచ్చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.. మహిళా రక్షణ గురించి సిఎం జగనన్నకు బాగా తెలుసన్నారు. అద్భుతమైన ఆలోచన, ఆశయంతో దిశచట్టానికి రూపకల్పన చేశారన్నారు. దేశంలోనే మొట్టమొదటి గా మహిళా రక్షణ కోసం చట్టం చేశారన్నారు. దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ ఫోన్ లో డౌన్ లోడ్ చేయించాలన్నారు.

 

 

 

 

కేంద్రం అమలు చేసిన నిర్భయ, ఫోక్సో చట్టాల కన్నా బలమైన చట్టంగా దిశా అవతరించిందన్నారు. జగనన్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళా అఘాయిత్యాలకు గురికాకూడదని సీఎం సంకల్పించారన్నారు. మహిళల మాన, ప్రాణాలకు భంగం కలిగించాలన్న ఆలోచన రాకుండా దిశా చట్టం పరిధిలో శిక్షలు రూపొందించారని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం రూపొందిన దిశా యాప్ ను ఆపదలో ఉన్న మహిళలు ఉపయోగించుకునేలా అవగాహన కలిగివుండాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో సంఘ మిత్రలు దిశా యాప్ డౌన్ లోడ్ చేయించి ఎక్కువ మందికి అవగాహన కల్పించాలన్నారు. అలా ఎక్కువ మందికి చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం అందించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జనం కోసం నడిచిన వాడు.. కష్టం విలువ తెలిసిన వ్యక్తి.. సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అందరికి మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. పథకాలతో ప్రతి నిరుపేదను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. రైతును రాజుగా మార్చే ప్రణాళిలతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ జగన్ పాలనను ఆశక్తిగా గమనిస్తున్నారన్నారు.

 

 

 

అనంతరం శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ఆచార్య జమున మాట్లాడుతూ.. దిశా చట్టం సిఎం మానసపుత్రిక అన్నారు. మహిళా భద్రతకు సిఎం పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. దిశా చట్టాన్ని ఏపిలో పకడ్బందీగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి మహిళ మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లల పట్ల అనునిత్యం జరుగుతున్న దారుణాలను ఉదహరించారు. మహిళలందరికీ రక్షణ కల్పించే కవచం దిశ చట్టం ఒక్కటే అని అన్నారు. దిశ యాప్ ను ప్రతి మహిళ డౌన్ లోడ్ చేయాలని కోరారు. అత్యవసరమైన పరిస్థితుల్లో దిశ యాప్ మహిళకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం ఏపీలో దిశ యాప్ ను తీసుకొచ్చారన్నారు. మహిళలపై దాడులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రార్ ఆచార్య మమత, రెక్టార్ ఆచార్య శారద, అడిషనల్ ఎస్పీ సుప్రజ ప్రసంగించారు. ప్రతి మహిళా స్పృహతో పాటు ఎంతో అప్రమత్తంగా మనల్ని మనం రక్షించుకోవాలని విశ్లేషించారు. స్త్రీకి కావాల్సిన భద్రత, గౌరవాన్ని కాపాడటానికి ఏర్పాటు చేసిన దిశా యాప్ ను కొనియాడారు. ముందు ఇంటి నుంచే స్త్రీకి భద్రత పెరగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

 

 

 

దిశా యాప్ ద్వారా ఎవరు.. ఎవరికీ మేసేజ్ చేయాలి.. మహిళా పోలీస్, సంఘ మిత్రలు, మహిళా సంఘాల లీడర్లకు వీడియో ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికీ దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించారు. సదస్సులో మహిళలు తాము దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నామని తమ మొబైల్స్ ను చూపారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి మహిళ డౌన్ లోడ్ చేయిస్తామని స్పష్టం చేశారు.ఈ అవగాహన సదస్సుకు చంద్రగిరి నియోజకవర్గమహిళా సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, మహిళా సమాఖ్య లీడర్లు, గ్రామ మహిళా పోలీస్ లు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: In Chandragiri .. Awareness seminar on “Disha” app

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page