జూన్ 28న పీవీ శత జయంతి సందర్బంగా తొమ్మిది గ్రంధాల ఆవిష్కరణ!

0 22

హైదరాబాద్  ముచ్చట్లు :

 

బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా  పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను గత ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. విద్యావేత్తగా, సాహితీవేత్తగా సాహితీరంగంలో విశేష కృషి చేసిన పీవీ నరసింహారావుకు నివాళిగా మహోన్నత మూర్తిమత్వం ఉన్న పీవీగారి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, పాలన దక్షతను, ఆర్థిక సంస్కరణలలో వారి కృషిని 360 డిగ్రీలలో ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని   ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అయ న  ఆదేశాలమేరకు ”పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ”ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి చైర్మన్ గా సీనియర్ పార్లమెంట్ సభ్యుడు  కె కేశవ రావును  నియమించారు.

 

 

- Advertisement -

పుస్తక ప్రచురణ ల కోసం ఉప కమిటీ :
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కోర్ కమిటీ, పుస్తక ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఒక ఉప కమిటీని నిపుణులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉప కమిటీలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కె రామచంద్రమూర్తి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ప్రభుత్వ సలహాదారు- సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు, పీవీ నరసింహారావు గారి తనయుడు ప్రభాకర్ రావు,  పీవీ నరసింహారావు తనయ -శాసన మండలి సభ్యురాలు సురభి వాణి దేవి,  అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామా రావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు- పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల ప్రత్యేక అధికారి మామిడి హరికృష్ణ సభ్యులుగా ఉన్నారు. వీరి పర్యవేక్షణలో దాదాపు సంవత్సర కాలపు కృషితో ఈ పుస్తకాలు వెలుగు చూసాయి. ఇక ఈ గ్రంధాల ప్రచురణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలకు అప్పగించింది. అలా ఇప్పుడు మొత్తం 8 పుస్తకాలను ప్రచురించారు. వాటిలో శ్రీ పీవీ రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Nine books unveiled on June 28 on the occasion of Peevy Centenary!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page