డాక్టర్లను కరోన వారియర్స్ గా గుర్తించడం అభినందనీయం…. డా. వంశీధర్ గౌడ్ ఎం.డి.

0 13

జగిత్యాల ముచ్చట్లు :

శని వారం కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ జగిత్యాల అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ ప్రవాస భారతీయులు  ఒమాన్ ఫ్రెండ్స్ అధ్యక్షుడు పన్నీరు నరేంద్ర సారధ్యంలో డాక్టర్ వంశీధర్ గౌడ్ కు ప్రకటించిన కరోన వారియర్స్ అవార్డును  శ్వేత మల్టిస్పెషల్ హాస్పిటల్ కార్యాలయములో వారు అందజేశారు.
ఈసందర్బంగా వంశీధర్ గౌడ్ మాట్లాడుతూ కరోనా రెండవ వేవులో ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ధైర్యంగా ఉండడంతో పాటు స్వీయ నియంత్రనలో ఉండి , డాక్టర్ సలహాలు పాటిస్తూ, పోషకాహారాన్ని తీసుకుంటే కరోనాను జయించవచ్చని పేర్కొన్నారు.
కరోనా సమయంలో పలువురు రోగులకు ఆహారం, మందులు స్వచ్ఛందంగా అందించడం అభినందనీయమన్నారు. ప్రజలు, అన్నివర్గాల సహకారంతో కరోనా రోగులకు సేవాలాందించానని తెలిపారు. పేద వారికి సేవలు అందించన డాక్టర్లకు కరోన వారియర్స్ అవార్డుతో ప్రోత్సాహించడం అభినందనీయం అని అన్నారు. సీనియర్ పాత్రికేయులు టివి సూర్యం, కళాశ్రీ గుండేటి రాజు, డాక్టర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ జగిత్యాలలో కరోనా సమయంలో ప్రజలకు, ముఖ్యంగా కరోనా రోగులకు  డాక్టర్ వంశీధర్ గౌడ్ వైద్య సేవలందించారాని కొనియాడారు. ఈ సందర్బంగా డాక్టర్ ను శాలువా, బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు టి.వి. సూర్యం, డాక్టర్ శ్యామ్ సుందర్, పాత్రికేయులు సిరిసిల్ల వేణుగోపాల్ పెండం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Recognizing doctors as corona warriors is commendable ….
Dr. Vamsidhar Gowd M.D.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page