దివ్యాంగుల కో కన్వీనర్ల నియామకం

0 8

జగిత్యాల  ముచ్చట్లు :

జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా శిశు, దివ్యంగుల సంక్షేమ కార్యాలయ ఆవరణంలో దివ్యంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కో- కన్వీనర్ సభ్యులను జిల్లా దివ్యాంగుల సంఘం కార్యదర్శి అఙ్గార్  ఖాన్, ధర్మపురి ఇంచార్జ్ భాస్కర్ లు నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల జాయింట్ ఆక్షన్ కమిటీ కన్వీనర్ అబ్దుల్, అజీజ్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ వికలాంగుల సంఘాల నుండి సామాజిక స్పృహ, సేవా భావం కలిగిన వికలాంగ నాయకులను కో- కన్వీనర్ సభ్యులుగా ఎంపిక చేసామని వారు జిల్లా, మండల స్థాయిలో దివ్యాంగులకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో వారి, ఆర్థిక,  సామాజిక భద్రత సంబంధించిన అంశాలలో ప్రభుత్వ  అధికారులకు, ప్రజాప్రతినిధులకు జిల్లాస్థాయి నాయకులకు తెలియజేయడం మరియు సమస్యల పరిష్కారం కోసం  వికలాంగుల జాయింట్ ఆక్షన్ కమిటీ చేపట్టబోయే కార్యక్రమాలకు తమ వంతు బాధ్యతను నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమ సమావేశంలో జిల్లా దివ్యాంగుల సంఘం   నాయకులు పాల్గొని అభినందించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Appointment of Divyangula Co-Convenors

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page