నిరుద్యోగులను నయవంచన చేయొద్దు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కౌశిక్

0 19

నెల్లూరు  ముచ్చట్లు :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ లో పూర్తి స్థాయి జాబ్ క్యాలండర్ ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చల్లా కౌశిక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఏదో ఒక ఉద్యోగం సాధించాలనే తపనతో ఆశయంతో కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా బాగ లేకపోయినా సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల ఆశలపై రాష్ట్రప్రభుత్వం నీళ్లు చల్లారని రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు.
సీఎం సార్ మోసం చేశారంటూ… 2.3 లక్షల ఉద్యోగాల పోస్టులు భర్తీ చేస్తామని నాడు హామీ ఇచ్చిన నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ,నేడు అధికారంలోకి వచ్చాక పదివేల పోస్టులకే పరిమితమవడం సిగ్గుచేటన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను మోసం చేయడంతో గత ప్రభుత్వాన్ని గద్దె దింపినట్టే ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేస్తే అదే దుస్థితి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.
జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గ్రూప్ 1, 2 సర్వీసులకు కలిపి 36 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పూర్తిస్థాయి జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags:Do not deceive the unemployed
ABVP Secretary of State Challa Kaushik

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page