పుంగనూరులో దిశ తో నేరాలను అదుపుచేద్దాం- సీఐ గంగిరెడ్డి

0 111

పుంగనూరు ముచ్చట్లు:

 

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్‌ ద్వారా నేరాలను అదుపు చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సీఐ గంగిరెడ్డి కోరారు. శనివారం ఆయన ఎస్‌ఐ ఉమామహేశ్వరరావుతో కలసి సచివాలయ పోలీసులు, మహిళామిత్రలు, విద్యార్థినీలకు దిశ యాప్‌ పై అవగాహన కల్పించారు. యాప్‌ను ప్రతి ఒక్కరు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలన్నారు. మహిళలకు వేదింపులు, కిడ్నాప్‌లు, అత్యాచారాలాంటి సమయాల్లో యాప్‌ను వినియోగించిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటారన్నారు. ప్రతి ఇంటిలోని మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే మహిళలు జాగ్రత్తగా ఉంటు అనుమానితులను గుర్తిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ వేణు, పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Let’s control crime with direction in Punganur- CI Gangireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page