ప్రజాసేవకు ప్రోటోకాల్ అవసరం లేదు

0 16

జనగామ    ముచ్చట్లు :
ప్రజా సేవ చేయడానికి పదవులు,ప్రోటోకాల్ అవసరం లేదని ఎమ్మెల్యే రాజయ్యపై మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో సీఎం ఆర్ ఎఫ్  చెక్కులు పంపిణీ చేసిన కడియం శ్రీహరి..మాట్లాడుతూ మొన్నీమధ్యే స్థానిక ఎమ్మెల్యే రాజయ్య తన పదవి కాలం జూన్ 2న ముగిసిందని కడియం కు ప్రొటోకాల్ లేదని మాట్లాడడంపై ఆయన స్పందించారు. ప్రజసేవ చేయడానికి పదవులు, ప్రొటోకాల్ అవసరం లేదని, నియోజకవర్గానికి రావడానికి ఎవరి లైసెన్స్ , అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని ధ్వజమెత్తారు. తనకి రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు పదవి ఉన్నా, లేకున్నా  అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యం అన్నారు. ప్రజలకు మేలుచేసే పనులు ఎవరు చేసిన స్వాగతించి, అభినందించాలని పిలుపునిచ్చారు. పార్టీకి కట్టుబడి మాత్రమే ఉంటామని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి నిజాయితీగా పని చేస్తాడని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటాడని ప్రజల్లో నాకు గుర్తింపు ఉందని దీన్ని నేను రాష్ట్రమంతటా కడియం శ్రీహరి అన్నారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదుల పట్ల అవగాహన లేనివారు హడావుడి చేయడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags:Public service does not require protocol

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page