సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం బూటకం: మందకృష్ణ

0 13

హైదరాబాద్‌ ముచ్చట్లు :
సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం బూటకమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. నేడు ఆయన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. దళితులను మరోసారి మభ్యపెట్టేందుకే కేసీఆర్‌ కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు. 2003 అక్టోబర్‌ 17న టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన… దళిత్‌ ఎంపవర్‌మెంట్‌లోని అంశాలను అఖిలపక్ష నేతలు గమనించాలన్నారు. ఆనాడు రాజకీయ కక్షలో భాగంగా తమను ఆహ్వానించలేదని మంద కృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమకు ఆహ్వానం అందలేదన్నారు. తెలంగాణ కేబినెట్‌, సీఎం సలహామండలిలో ఎంతమంది దళితులున్నారన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశాన్ని స్వాగతిస్తున్నామని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

- Advertisement -

Tags:CM Dalit Empowerment Scheme Fake: Mandakrishna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page